కరోనా పరిస్థితుల దృష్ట్యా కొన్ని నెలలుగా ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిలిపివేశారు. తనిఖీలు చేయకపోవటంతో మందుబాబులు యథేచ్చగా రోడ్లపై తిరుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు వినియోగించే బ్రీత్ ఎనలైజర్ పరికరంలో నోటితో ఊదాల్సి ఉంటుందని....విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్ తెలిపారు. నోటి తుంపరుల వల్ల కొవిడ్ వ్యాప్తి జరిగే అవకాశముందని చెప్పారు. కరోనా జాగ్రత్తల్లో భాగంగానే తనిఖీలు తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. రక్త పరీక్ష చేయటం ద్వారా ఆల్కహాల్ శాతం తెలుసుకోవచ్చని...ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఇదీ చదవండి:
'అమరావతి కోసం రైతుల గుండెలు ఆగినా...సీఎం గుండె మాత్రం కరగడం లేదు'