కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్క్‌ల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా అధిక ధరలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 254 మందుల దుకాణాలపై ఔషద నియంత్రణ పరిపాలన శాఖాధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో 2లక్షల వరకు రకారకాల మాస్కులను, ఎన్ 95 మాస్కులు 2,800 వరకు ఉన్నట్లు గుర్తించారు. ఒంగోలులోని శ్రీమౌర్య మెడికల్ షాపులో 20 రూపాయల మాస్క్‌ను 30 రూపాయలకు విక్రయించటంపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.మందుల ఉత్పత్తి, పంపిణీదారులు, విక్రయదారులు నిబంధలను వ్యతిరేకించినట్లయితే 0863 - 2339246 , 9490153357 నెంబర్లకు సమాచారమివ్వాలని కోరారు.
సెంట్రల్ మానిటరింగ్ యూనిట్
మందుల లభ్యత, ఇతర అంశాలు పరిశీలించేందుకు సెంట్రల్ మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు ఔషద నియంత్రణ పరిపాలనా శాఖ అధికారి మల్లిఖార్జున వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 58 రకాల మందుల తయారీకి సంబంధించిన ముడిసరకు పరంగా ఎటువంటి సమస్యలు లేవన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్లు మందులు అందుబాటులోనే ఉంటాయన్నారు. దేశ అవసరాలకు తగ్గట్లు మందులు అందుబాటులో ఉంటున్నాయా ? లేవా ? అన్న దానిపై పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా కేంద్రం దృష్టిసారిస్తుందన్నారు.
ఇవీ చదవండి