ETV Bharat / city

దళితుల ప్రాణాలంటే వైకాపాకు లోకువ.. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల ఆవేదన

Subrahmanyam parents Meet CBN: తమకు అన్ని విధాలా అండగా ఉంటానని అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు(ఉదయభాస్కర్​) చేతిలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో చంద్రబాబుని కలిసిన వారు.. ఈ కేసులో ప్రభుత్వం జరిపించే విచారణ మీద తమకు నమ్మకం లేదని వాపోయారు.

author img

By

Published : Jun 24, 2022, 5:11 PM IST

Driver Subrahmanyam parents meet Chandrabab

Subrahmanyam parents on Murder Enquiry: వైకాపా పాలకులకు దళితుల ప్రాణాలంటే లోకువ అని ఎమ్మెల్సీ అనంతబాబు(ఉదయభాస్కర్​) చేతిలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. ప్రభుత్వం జరిపించే విచారణ మీద తమకు నమ్మకం లేదని.. అందుకే సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో చంద్రబాబుని వారు కలిశారు.

ఎమ్మెల్సీ ఆనంతబాబు.. తమ కొడుకును అన్యాయంగా చంపేశాడంటూ చంద్రబాబు ఎదుట ఆ కుటుంబసభ్యులు బోరున విలపించారు. తమ కుమారుడు హత్య కేసులో పోలీసుల ద్వారా న్యాయం జరగలేదని వాపోయారు. నిందితుడు ఆనంతబాబుని కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని వారు ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపించాలనే తమ డిమాండ్​ను పట్టించుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా.. అన్ని విధాలా అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు చెప్పారు. సీబీఐ విచారణ జరిపించేలా తనవంతు ఒత్తిడి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.