జైళ్ల శాఖలో డ్రైవర్ పోస్టుల కోసం దరఖాస్తుల స్వీకరణకు సోమవారం చివరి రోజు కావడంతో విజయవాడలోని ఆ శాఖ కార్యాలయం వద్దకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలివచ్చారు. నేరుగా జైళ్ల శాఖ డీజీ కార్యాలయం నుంచే దరఖాస్తులు తీసుకుని, అక్కడే సమర్పించాలని నిబంధన ఉన్న కారణంగా... చాలామంది వాటిని పొందలేకపోయారు.
ఇంకొందరు నిర్ణీత గడువులోగా సమర్పించలేకపోయారు. ఈ విషయంపై పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. జైళ్ల శాఖ డీజీ మహ్మద్ హసన్ రెజా స్పందించారు. దరఖాస్తులు సమర్పించేందుకు.. అందరికీ అవకాశం కల్పించామని స్పష్టం చేశారు. గడువు ముగిసిందని చెప్పారు.
ఇదీ చదవండి: