కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం కావాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని కోరారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు... రేపు ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ప్రజలు ఇంట్లోనే ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు ఎదుర్కోవటంపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం కల్పించే విషయంపై చర్చిస్తున్నామని, త్వరలోనే ఆదేశాలు ఇస్తామని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని కొద్దిరోజులపాటు వాయిదా వేస్తున్నామని మంత్రి తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, ప్రయాణాలు చేయొద్దని ఆళ్ల నాని కోరారు.
ఇదీ చదవండి:రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేత