విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో మరణించిన దివ్య తేజస్విని తల్లిదండ్రులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేడు కలవనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు హోంమంత్రి సుచరితతో కలిసి వారు సీఎంను కలుస్తారు. జరిగిన దారుణాన్ని వారు సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరోవైపు ఈ హత్య కేసులో ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
ఈ నెల 15న విజయవాడలోని క్రీస్తురాజపురం పెదబావి సెంటర్‌కు చెందిన వంకాయలపాటి దివ్య తేజస్విని (20)పై అదే ప్రాంతానికి చెందిన నాగేంద్రబాబు అలియాస్ చిన్నస్వామి కత్తితో దాడి చేసి చంపేశాడు. తర్వాత అదే కత్తితో తన చేతులపైనా పొట్టలోనూ పొడుచుకున్నాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం స్పష్టించిన సంగతి తెలిసిందే. నిందితుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చదవండి