రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 77ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రైవేట్‌పరం చేయడం సరికాదన్నారు. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం కంటే ఎలిమెంటరీ స్కూళ్లను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో.. విద్యార్థి, ప్రజా సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన 'నేడు నెలకొన్న విద్యారంగ పరిస్థితుల'పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేటీకరణ, ఎలిమెంటరీ తరగతుల విలీనంతోపాటు జీవో నంబర్ 77 రద్దు వంటి అంశాలపై చర్చాగోష్ఠి నిర్వహించారు.
'ఎయిడెడ్ విద్యాసంస్థలు దాతల సహాయంతో స్థాపించి శతాబ్దాలుగా ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దితున్నాయి. అలాంటి పాఠశాలలను ప్రైవేటు పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం దారుణం. ఎలిమెంటరీ స్కూల్ 3, 4, 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేసి పాఠశాలను కుదించడం మంచిపద్ధతి కాదు. ఈ అంశాలను వ్యతిరేకిస్తూ.. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం' -లక్ష్మణరావు, ఎమ్మెల్సీ
ఇదీ చదవండి..
High court: రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష, జరిమానా విధింపు..