DGP meet with CM YS Jagan: సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1 న ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపునిచ్చిన దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో సమీక్షించారు. చలో విజయవాడకు ఇప్పటివరకు పోలీసుల నుంచి ఎటువంటి అనుమతి రాలేదు. ఉద్యోగులు విజయవాడ రాకుండా తీసుకుంటున్న చర్యలు, తనిఖీలు, ముందస్తు అరెస్టులు, నిఘా తదితర అంశాలను సీఎంకు వివరించారు. చలో విజయవాడను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీకి సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు అనుమతులు సహా భద్రతపై డీజీపీతో సీఎం చర్చించారు.
CPS Employees Protest: ఎన్ని ఆటంకాలు వచ్చిన సెప్టెంబర్ ఒకటవ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత గుర్రం మురళి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని శాంతియుత ప్రదర్శనకు పిలుపినిస్తే, అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఇప్పటికే సీపీస్ రద్దుపై సంబంధిత మంత్రులతో చర్చలు జరిపిన ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. అంధ్రప్రదేశ్‌లో సైతం అదే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీస్ విధానాన్ని రద్దు చేసి.. ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని మురళి తెలిపారు.
Police Notices: రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలనే డిమాండ్‌తో ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగులను నిలువరించేందుకు పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. చలో విజయవాడ, సీఎం నివాసం ముట్టడిలో పాల్గొనకుండా.. సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులకు వ్యక్తిగతంగా నోటీసులిస్తూ తహసీల్దార్ల ఎదుట బైండోవర్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగులు పిలిస్తే కిరాయికి వెళ్లవద్దంటూ ప్రైవేటు వాహనదారులకు సూచిస్తున్నారు. విజయవాడ హోటళ్లలోనూ ముందస్తుగా సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి: