ETV Bharat / city

రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కాగా అమలు చేస్తాం: డీజీపీ

DGP Rajendranath Reddy meet Home Minister: రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కాగా అమలు చేస్తామని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. సచివాలయంలో హోం మంత్రి తానేటి వనితను డీజీపీ మర్యాదపూర్వకంగా కలిశారు.

హోం మంత్రి తానేటి వనితతో డీజీపీ భేటీ
హోం మంత్రి తానేటి వనితతో డీజీపీ భేటీ
author img

By

Published : Apr 19, 2022, 3:47 PM IST

DGP Rajendranath Reddy: రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గింపు, సారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టిసారించామని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. హోం మంత్రి తానేటి వనితతో డీజీపీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తానేటి వనితకు డీజీపీ శుభాకాంక్షలు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కాగా అమలు చేస్తామని.. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లు డీజీపీ తెలిపారు. నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసులో సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని.. ఎవరిదగ్గరైనా ఆధారాలుంటే ఇవ్వాలని సమన్లు జారీ చేసినట్లు చెప్పారు. కర్నూలు జిల్లా ఆలూరు ఘటనలో 82 మందిని అరెస్టు చేశామన్నారు. అలాగే.. దిశ యాప్‌లో రిజిస్టర్ అయ్యే మహిళల సమాచారం గోప్యంగా ఉంచినట్లు స్పష్టం చేశారు. మంత్రి ఉషశ్రీచరణ్ ర్యాలీ సందర్భంగా ఓ చిన్నారి చనిపోయిందన్న ఘటనపై స్పందించారు. మంత్రి ర్యాలీకి, చిన్నారిని తీసుకెళ్లే సమయానికి గంట తేడా ఉందన్నారు.

అనంతరం అడిషనల్ డీజీ రవిశంకర్, ఐజీ ప్లానింగ్ నాగేంద్రబాబు, లా అండ్ ఆర్డర్ డీఐజీ రాజశేఖర బాబు, ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, ఐజీ టైనింగ్ వెంకటరామి రెడ్డి, గుంటూరు ఎస్పీ అరిఫ్ అహ్మద్, ఇతర అధికారులు.. హోమంత్రిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. డిపార్ట్​మెంట్​లో నెలకొన్న అంశాలపై ఉన్నతాధికారులతో తానేటి వనిత చర్చించారు.

ఇదీ చదవండి: 'ఇష్టమొచ్చినట్లు అప్పులు చేస్తున్న ప్రభుత్వాన్ని గవర్నర్​ ఎందుకు అడ్డుకోలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.