రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా కలెక్టర్లు లాక్ డౌన్ అమలు చేయాలనుకుంటే ప్రభుత్వ పెద్దలు అడ్డుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్నా... ముఖ్యమంత్రిలో చలనం లేదని విమర్శించారు. వ్యాధి పెద్ద ఎత్తున విజృంభిస్తుంటే, ముఖ్యమంత్రి, మంత్రులు నిర్లిప్తంగా ఉండటం తగదని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రికి కరోనా వస్తే చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లటం... ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో నిర్లక్ష్యాన్ని చాటిందన్నారు.
వడ్డీలపై స్పష్టత ఇవ్వాలి
ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద జారీ చేసిన జీవో నెం. 464.. ఆ తర్వాత ఇచ్చిన మెమోల ద్వారా లక్ష రూపాయలకు పైబడి వెయ్యి రూపాయలు అదనంగా రుణం తీసుకున్నా.. 7 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్న వైనంపై మంత్రి కన్నబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సున్నా వడ్డీ పథకంలోని లోగుట్టు ఏమిటో.. 3 శాతం, 4 శాతం వడ్డీలేమిటో రైతులకు అర్థమయ్యేలా స్పష్టంగా ప్రకటించాలని దేవినేని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
లాక్డౌన్లో టికెట్లు తీసుకున్న ఆర్టీసీ ప్రయాణికులకు నగదు వాపస్