ఎన్నికల హమీలు అమలు చేయడంలో వైకాపా ప్రభుత్వం మాట తప్పిందని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. కేంద్రం నుంచి తెచ్చిన 70 వేల కోట్ల రూపాయలు ఏం చేశారో, ఎక్కడ ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం ఎందుకు ఆన్లైన్లో పెట్టడం లేదని ప్రశ్నించారు.
22 మంది ఎంపీలను పెట్టుకొని కూడా పోలవరానికి నిధులు తెచ్చుకోవడం చేతకాలేదని దేవినేని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పేరుతో ఇచ్చిన కాంట్రాక్టర్ లంకారెడ్డి ఎవరని ప్రశ్నించిన ఆయన.. కడప జిల్లా అని ఇచ్చారా లేక బంధువని ఇచ్చారా అని దుయ్యబట్టారు. రివర్స్ టెండరింగ్ అంటే నామినేషన్‌పై కాంట్రాక్ట్ ఇవ్వడమా అని నిలదీశారు.
ఇవీ చదవండి...