ETV Bharat / city

జగన్ దర్శకత్వంలో అంతులేని కథలా పోలవరం: దేవినేని

పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం ఎత్తు ఒక మీటర్ తగ్గించమని అడిగితే...సీఎం జగన్ లాలూచీ పడి 4మీటర్లు తగ్గిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. జగన్ దర్శకత్వంలో పోలవరం ప్రాజెక్టు అంతులేని కథలా సాగుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

జగన్ దర్శకత్వంలో అంతులేని కథలా సాగుతున్న పోలవరం

author img

By

Published : Dec 14, 2020, 7:31 PM IST

జగన్ దర్శకత్వంలో పోలవరం ప్రాజెక్టు అంతులేని కథలా ఉందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. గత ఏడాది జూన్ నాటికి ప్రాజెక్టు పనులు 71.2శాతం పూర్తైతే..ఇవాళ జరిగిన ముఖ్యమంత్రి సమీక్షలో 72.09గా తేల్చి ఏడాదిన్నరలో కేవలం 0.89శాతం పనులు మాత్రమే చేసినట్లు ఒప్పుకున్నారని దుయ్యబట్టారు. 18 నెలలుగా 1 శాతం పనులు కూడా చేయలేని వారు.. 2022 జూన్ నాటికి ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. 135 అడుగులకు మాత్రమే ప్రాజెక్టు నిర్మించి 120 టీఎంసీల నీరు నిలబెట్టేందుకు నిర్ణయించారని ఆరోపించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మీటర్ తగ్గించమని అడిగితే...లాలూచీ పడి 4మీటర్లు తగ్గిస్తున్నారని మండిపడ్డారు.

నిర్వాసితులకు రూ.27 వేల కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉండగా...3,330 కోట్లు మాత్రమే ఇస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 అడుగుల మేర పోలవరం నిర్మించి 194 టీఎంసీల నీరు ఎప్పటికి నిలబెడతారో సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు. 2022 జూన్ నుంచి 2025 జూన్ వరకు 60 టీఎంసీలు, 90 టీఎంసీలు, 120 టీఎంసీలు ఇలా పెంచుకుంటూ పోతామనటం దుర్మార్గమని ఆక్షేపించారు.

చంద్రబాబు హయాంలో 30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తే...జగన్ 3లక్షల క్యూబిక్ మీటర్లు వేసి పోలవరం కట్టానని చెప్పుకోవటం సిగ్గుచేటని మండిపడ్డారు. 16 నెలలుగా 600 మంది కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు చెల్లించట్లేదని విమర్శించారు. ప్రాజెక్టుకు ఏడాదిన్నరగా రూ.200 కోట్లు కూడా ఖర్చు చేయకుండా...రూ. 225 కోట్లతో వైఎస్ విగ్రహం పెడతామంటున్నారని ఆక్షేపించారు. గోదావరి బేసిన్​ నుంచి కృష్ణ బేసిన్​కు పట్టిసీమ ద్వారా 336 టీఎంసీలు వచ్చాయని ముఖ్యమంత్రి సమీక్షలోనే ప్రభుత్వం ఒప్పుకుందని తెలిపారు.

ఇదీచదవండి

పోలవరం ఎత్తు ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గదు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.