ETV Bharat / city

'ఇసుక తరలింపుపై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై లేదు' - పంట నష్టంపై మాజీ మంత్రి దేవినేని విమర్శలు

ఇసుక తరలింపుపై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై లేదని...ధాన్యం సకాలంలో కొనుగోలు చేయనందునే రైతులు నష్టపోయారని మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.

devineni uma comments on crop loss
మాజీమంత్రి దేవినేని ఉమ
author img

By

Published : Apr 29, 2020, 4:03 PM IST

ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకే రైతులు నష్టపోయారని మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ప్రభుత్వానికి ఇసుక తరలింపుపై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై లేదని విమర్శించారు. ధరల స్థిరీకరణ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల నిలువు దోపిడి చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఇవ్వాల్సిన 500కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ధాన్యానికి 1376 రూపాయల మద్దతుధర ఉంటే, దళారులు 800 నుంచి 900 రూపాయలకు కొనుగోలు చేసి రైతుల కడుపుకొడుతున్నారని మండిపడ్డారు.

ఇవీ చదవండి...కొవిడ్‌ చికిత్సలో వైద్యులకు తోడ్పాటుగా... నెల్లూరు రోబో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.