5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ప్రజారాజధాని నిర్మాణానికి అన్ని వర్గాల రైతులు ౩౩వేల ఎకరాలు త్యాగం చేశారని మాజీమంత్రి దేవినేని ఉమా కొనియాడారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా 130 రోజులుగా నిబంధనలు పాటిస్తూ దీక్ష చేస్తుంటే.... వీరి గోడు ప్రభుత్వానికి కనిపించడం లేదాంటూ ఉమా మండిపడ్డారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలని కూడా గౌరవించకుండా... విశాఖపట్నంకు రాజధాని మార్పు నిర్ణయం జరిగిపోయిందన్న వైకాపా నాయకుల వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ట్విటర్లో డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి...తడిసిన ధాన్యం రాశులు... తల్లడిల్లిన అన్నదాతలు