ETV Bharat / city

Devineni fires on YSRCP: ప్రభుత్వం రివర్స్ డ్రామాలు ఆడకుండా ఉంటే పోలవరం పూర్తయ్యేది: దేవినేని - ap latest news

Devineni fires on YSRCP: పోలవరం ప్రాజెక్టు పూర్తికి కావాల్సిన సాయాన్ని సీఎం జగన్.. కేంద్ర జల్‌శక్తి మంత్రిని అడగలేకపోయారని.. తెదేపా నేత దేవినేని ఉమా విమర్శించారు. 28 మంది ఎంపీలు ఉండి ఆర్థిక అనుమతులు పొందలేకపోయారని, కావల్సినవి అడగటంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని దుయ్యబట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం Devineni fires on YSRCP: పోలవరాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం రివర్స్ డ్రామాలు ఆడకుండా ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తై ఉండేదన్నారు.

Devineni fires on YSRCP
ప్రభుత్వం రివర్స్ డ్రామాలు ఆడకుండా ఉంటే పోలవరం పూర్తయ్యేది: దేవినేని
author img

By

Published : Mar 5, 2022, 12:49 PM IST

Updated : Mar 5, 2022, 1:02 PM IST

Devineni fires on YSRCP: పోలవరం నిర్వాసితులకు సమస్యలేవీ లేవన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్​కు చెప్పే ప్రయత్నం చేశారని.. మాజీమంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. పునరావసం కింద ఎన్ని ఇళ్లు, ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితిలో సీఎం ఉన్నారని విమర్శించారు. సుమారు లక్ష కుటుంబాలకు కట్టాల్సిన ఇళ్లపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పోలవరం పరిశీలనకు వస్తే.. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అడ్రెస్ లేకుండా పోయాడని దుయ్యబట్టారు. పోలవరంపై జరిగిన పనులు చెప్పి, కావాల్సినవి అడగటంలో ముఖ్యమంత్రి విఫలమై తన అసమర్థత నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు.

వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డ తెదేపా నేత దేవినేని ఉమా

డీపీఆర్ కు సంబంధించి రూ.55,548కోట్లకు ఆమోదం తెలిపితే, 28మంది మంత్రులు ఉండి కూడా ఎందుకు ఆర్థిక అనుమతులు పొందలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పర్యటనలో రూ.47,725కోట్లు ఇస్తే చాలని రాజీపడటంలో పిరికితనం వెనుక ఆంతర్యం ఎంటని నిలదీశారు. స్వార్థప్రయోజనాల కోసం ఎందుకు పోలవరం తాకట్టు పెడుతున్నారని ఆక్షేపించారు. నిర్వాసితులకు ద్రోహంచేసే హక్కు ఈ సీఎంకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం రివర్స్ డ్రామాలు ఆడకుండా ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తై ఉండేదన్నారు.

కేసుల నుంచి తప్పించుకునేందుకే..

సీబీఐ, ఈడీ, బాబాయి హత్య కేసుల నుంచి తప్పించుకునేందుకే.. జగన్ రాజీపడి కేంద్రం ముందు నోరెత్తలేదని దేవినేని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు, కేంద్రమంత్రి ఏం చెప్తారని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తుంటే.. మంత్రుల కార్ పార్కింగ్ గొడవకి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:

Lokesh fires on CM Jagan: పోలవరం నిర్వాసితుల పరిహారాన్ని సీఎం పరిహాసం చేశారు: లోకేశ్

Last Updated : Mar 5, 2022, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.