విజయవాడ గుణదల మూడో డివిజన్ నగర పాలక సంస్థ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాణిపై దాడికి.. వైకాపాకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ వర్గీయులు దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. ఈ మేరకు స్థానిక తేదేపా వర్గీయులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి మూడవ డివిజన్ కార్పరేటర్ అభ్యర్ధిపై దాడి చేసిన కోనేరు వాసు.. తేదెపా నాయకుడని అన్నారు. తమపై అవాస్తవాలు ప్రచారం చేసే నాయకులు.. తెలుసుకొని మాట్లాడాలని దేవినేని అవినాష్ హితవు పలికారు.
ఇదీ చదవండి:
పంచాయతీ ఎన్నికలు మూడో దశ పోలింగ్: 10:30 కి 40.29 పోలింగ్ శాతం నమోదు