ఐఆర్ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్..విజయవాడలో ఆదాయపన్ను శాఖ (టీడీఎస్) కమిషనర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ అధికారులు, ఉన్నతాధికారులు దయాసాగర్‌కు ఘన స్వాగతం పలికారు. దయాసాగర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ 1992 బ్యాచ్‌కి చెందినవారు. విజయవాడలో ఆదాయపు పన్ను (టిడిఎస్) కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టిడిఎస్ సంబంధిత విషయాలను అమలు చేస్తారు.
ప్రభావవంతమైన టిడిఎస్ పన్ను పరిపాలన, ఫిర్యాదురహిత పన్ను నిర్వహణ, పన్ను మినహాయింపుదారులకు మెరుగైన పన్ను చెల్లింపుదారుల సేవలు, బకాయి పన్నుల సత్వర సేకరణ, లక్ష్యాల సాధనలే తన ప్రాధాన్యతలని దయాసాగర్ తెలిపారు.
ఇదీ చదవండి :