ETV Bharat / city

సాగు యంత్రాల అద్దె కోసం.. కస్టమ్ హైరింగ్ కేంద్రాలు - రైతులకు అద్దెకు సాగు యంత్రాలు న్యూస్

వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు సాగు యంత్రాలను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ప్రారంభించాలని భావిస్తోంది. రైతులు, కౌలు రైతులు ఈ కస్టమ్ హైరింగ్ కేంద్రాల నుంచి సాగుకు అవసరమయ్యే యంత్రాలను సులువుగా అద్దెకు తీసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగానే ఇవి పని చేయనున్నాయి.

custom hiring centers for farmers in andhrapradesh

author img

By

Published : Aug 3, 2020, 10:09 PM IST

రాష్ట్రవ్యాప్తంగా రైతుల భరోసా కేంద్రాలకు అనుసంధానంగా వ్యవసాయ శాఖ సాగు పనిముట్లను రైతులకు అందుబాటులో ఉంచేందుకు కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. రైతులకు వ్యవసాయ పనిముట్లు, ఆధునిక యంత్రాలను అందుబాటులో ఉంచేందుకు ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాక్టర్లు, వరినాటు యంత్రాలు, కలుపుతీత యంత్రాలు, పిచికారీ సంబంధిత పరికరాలు ఇలా వేర్వేరు యంత్రాలను కస్టమ్ హైరింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 వేల 641 రైతు భరోసా కేంద్రాల్లో ఈ సాగు పనిముట్లను అద్దె ప్రాతిపదికన తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రైతులు, కౌలు రైతులు తమకు అవసరమైన సాగు పనిముట్లను పొందేందుకు ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్లను సంప్రదించాల్సి ఉంటుంది. కరోనా కారణంగా రైతులకు కూలీల లభ్యత తక్కువ కావటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. త్వరితగతిన కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. స్థానికంగా ఉన్న యువతకు ఈ కస్టమ్ హైరింగ్ కేంద్రాల్లోని పరికరాల నిర్వహణ బాధ్యతను అప్పగించనున్నారు.

వాస్తవానికి గతంలో అమలైన ఈ తరహా పథకానికి స్వల్పంగా మార్పులు చేసి నేరుగా రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానించాలని భావిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్వంలో ఈ హైరింగ్ కేంద్రాలకు యంత్రాలను అద్దె ప్రాతిపదికన ఇచ్చేలా అందుబాటులో ఉంచనున్నారు. 40 శాతం తక్కువకే ఈ యంత్రాలు రైతులకు అద్దె ప్రాతిపదికన లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరైనా రైతులు ఈ యంత్రాలను కొనుగోలు చేయాలనుకున్నా అది తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా చూడాలని వ్యవసాయ శాఖ యోచిస్తోంది. సంబంధిత కంపెనీలతో చర్చించి జిల్లా, నియోజకవర్గస్థాయిలో యంత్రాల ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చదవండి: భారత్‌లో 2 కోట్లు దాటిన కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.