ETV Bharat / city

'కరోనాపై అప్రమత్తంగా ఉండండి.... అవగాహన కల్పించండి' - latest corona news

కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కలిగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.

కరోనా వైరస్​పై సచివాలయంలో సీఎస్ సమీక్ష
కరోనా వైరస్​పై సచివాలయంలో సీఎస్ సమీక్ష
author img

By

Published : Mar 5, 2020, 6:53 AM IST

Updated : Mar 5, 2020, 7:34 AM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సంబంధిత శాఖలు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. కరోనా రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు దీనిపై అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం అనుమానిత కేసులే నమోదయ్యాయని... ఎవరికీ వైరస్‌ సోకిన దాఖలాలు లేవని ఆమె వివరించారు.

విమానాశ్రయాలు, ఓడరేవుల్లో కరోనా వైరస్​పై స్ర్కీనింగ్ చర్యలు చేపట్టాలని, ఎక్కడైనా అనుమానిత కేసులు నమోదైతే వెంటనే వారిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి మెరుగైన చికిత్సలు అందించాలని ఆదేశించారు.విదేశాల నుండి వచ్చే ప్రతి వ్యక్తిని తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయటంతో పాటు అలాంటి వారు కొంత కాలం పాటు ఇతర వ్యక్తులతో కలవకుండా, ఇతర ప్రాంతాల్లో తిరగకుండా ఇంటికే పరిమితమై ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. కరోనా వైరస్ అనుమానిత కేసులు వస్తే అలాంటి వారి ఫొటోలు, పేర్లు వంటి వివరాలను మీడియాలో ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలకూ సీఎస్ సూచించారు. కరోనా వైరస్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి తోడ్పాటును అందించాలని ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు జిల్లాల్లో నోడల్​ అధికారిగా వ్యవహరించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు కృషి చేయాలని సీఎస్ కోరారు.

రాష్ట్రంలో కరోనా వైరస్​పై అధికారులతో సీఎస్ సమీక్ష

ఇవీ చదవండి

పేటీఎం ఉద్యోగికి కరోనా-29కి చేరిన బాధితులు

Last Updated : Mar 5, 2020, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.