మహాత్ముని అడుగుజాడల్లో దేశాన్ని నడిపించేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహాత్ముని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముందుగా మైదానంలో పర్యావరణ కాలుష్యంపై గీసిన పలు చిత్రాలను కలెక్టర్ ఇంతియాజ్, కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి పరిశీలించారు. ప్లాస్టిక్‌ను విడనాడి అందరూ చేతి సంచులు వాడాలని నగరవాసులకు సూచించారు. క్విట్ ప్లాస్టిక్ అనే నినాదంతో...విద్యార్థులు, నగరవాసులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా క్రెడాయ్, నారెడ్కో అందించిన నార, వస్త్ర సంచులను సీఎస్ ప్రదర్శించారు.
ఇవీ చూడండి-ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం...భావితరాలను కాపాడుదాం