ETV Bharat / city

'మార్పు మొదలైంది...భాజపాకు ప్రజలు బుద్ధి చెబుతారు'

రష్యాలో అక్టోబరు విప్లవం విజయవంతమై లెనిన్ నాయకత్వంలో సోషలిస్టు పాలన అజేయంగా సాగిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. రష్యన్ విప్లవానికి 103 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీపీఎం నేతలు విజయవాడలో ర్యాలీ చేశారు. నగరంలో 15 రోజుల పాటు సోషలిజంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు చేపడతామన్నారు. భాజపా పాలనకు వైకాపా, తెదేపా మద్దతిస్తున్నాయన్న ఆయన...ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని రాఘవులు పేర్కొన్నారు.

Cpm  rally
Cpm rally
author img

By

Published : Nov 7, 2020, 4:33 PM IST

రష్యాలో అక్టోబరు విప్లవం విజయవంతమై లెనిన్ నాయకత్వంలో సోషలిజం అజేయంగా దశాబ్దాల పాటు నడిచిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. విజయవాడలో సోషలిజాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, 15 రోజులపాటు సోషలిజంపై ప్రజలకు వివరిస్తామన్నారు. అమెరికాలో ట్రంప్ ఓటమితో మార్పు ప్రారంభమైందని... ఆ మార్పు ప్రపంచవ్యాప్తంగా వస్తుందన్నారు.

భాజపాకు కూడా భవిష్యత్తులో ప్రజలు బుద్ధి చెబుతారని రాఘవులు అన్నారు. కరోనాను అరికట్టడంలో భాజపా పూర్తిగా విఫలమైందన్నారు. వైకాపా, తెదేపా కొన్ని సందర్భాల్లో భాజపా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయని ఇది భవిష్యత్​లో చాలా ప్రమాదకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఈ 15 రోజుల ప్రచార కార్యక్రమంలో ప్రజలకు వివరిస్తామన్నారు.

ఇదీ చదవండి

'శ్రీదేవి అక్కా.. పేకాట గురించి మాట్లాడలేదని ప్రమాణం చేస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.