కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విజయవాడలో అన్నారు. రెండురోజుల పాటు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించినట్లు తెలిపారు.
చెప్పిందొకటి.. చేస్తోందొకటి..
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో వైకాపా సహా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడాన్ని తమ పార్టీ ఖండిస్తోందని మధు చెప్పారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించడాన్ని ఉత్తరాంధ్ర రైతులు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ కార్మికులకు అనేక హామీలిచ్చారు కానీ.. ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పటిదాకా కొన్న ధాన్యానికే బకాయిలు చెల్లించకపోవడంపై మండిపడ్డారు. రైతులకు భరోసా, ఇతర సంక్షేమ పథకాలు మంచివే అయినప్పటికీ.. సంక్షేమ పథకాలతోనే ప్రభుత్వాన్ని నడపాలంటే కష్టమని అన్నారు. ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అందరు కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
ఇదీ చదవండి: