CPI Ramakrishna: విజయవాడను పోలీసు వలయంలో ఉంచారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఇది ప్రజా ప్రభుత్వమా.. పోలీసు రాజ్యమా అని ధ్వజమెత్తారు. విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో ముళ్లకంచెలు వేశారని.. సీపీఎస్ రద్దు కోసం యూటీఎఫ్ నేతల శాంతియుత నిరసనలకూ అనుమతించకపోవడం దుర్మార్గమన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తామని.. ఇప్పటివరకు చేయలేదని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపడం దారుణమన్నారు.
పోరాటం ఆగదు: సీపీఎస్ రద్దు చేయాలని చలో విజయవాడకి పిలునిస్తే.. ఎక్కడకి అక్కడ యూటీఎఫ్ నాయకులను, ఉపాధ్యాయులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. చలో విజయవాడ కి బయలుదేరిన లక్ష్మణరావు హౌస్ అరెస్ట్ చేశారు.
ఇంటి వద్ద ఆయన మాట్లాడుతూ... పాదయాత్రలో ఉన్నప్పుడు సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి నేడు మాట తప్పారన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని దానిని ముఖ్యమంత్రి కాలరాస్తున్నారన్నారు. ఎటువంటి షరతులు, స్కీంలు లేకుండా సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
"సీఎంవో ముట్టడి"కి యూటీఎఫ్ పిలుపు... భగ్నం చేసేందుకు పోలీసుల విశ్వప్రయత్నాలు