ETV Bharat / city

'వలస కార్మికుల సమస్యలపై రేపు నిరసన' - cpi ramakrishna comments on migrant labours

వలస కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్​ చేశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో వారివారి ప్రాంతాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి కార్మికుని ఖాతాలో రూ.10 వేలు జమచేసి వారిలో భరోసా నింపాలని విజ్ఞప్తి చేశారు.

'వలస కార్మికుల సమస్యలపై రేపు నిరసన'
'వలస కార్మికుల సమస్యలపై రేపు నిరసన'
author img

By

Published : May 3, 2020, 4:18 PM IST

వ్యవసాయ, వలస, భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ... రేపు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. వలస కార్మికుల సమస్యలపై హైకోర్టులో వేసిన పిటిషన్​ సోమవారం విచారణకు వస్తుందని చెప్పారు.

కోర్టు నుంచి సానుకూల తీర్పు వెలువడే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికుల సమస్యలను పరిష్కరించేలా దృష్టి సారించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. వలస కార్మికులను వారి ప్రాంతాలకు పంపించేందుకు వెసులుబాటు కల్పించాలని డిమాండ్​ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి కార్మికుని ఖాతాలో రూ.10 వేలు జమచేసి... కనీసం 50 కేజీల బియ్యం, గోధుమలు సరఫరా చేసి వారికి భరోసా కల్పించాలని కోరారు.

ఇదీ చూడండి..

'మద్యం దుకాణాలు కాదు.. అన్న క్యాంటీన్లు తెరవండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.