హోదాపై ప్రజలను సీఎం జగన్ మభ్యపెడుతున్నారని .. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. భాజపాకు రాజ్యసభలో పూర్తి మెజారిటీ లేని విషయం జగన్కు తెలియదా? అని ప్రశ్నించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి మద్దతిచ్చినప్పుడు హోదాపై ఎందుకు గట్టిగా అడగలేదని నిలదీశారు. వచ్చేసారి మీ మద్దతుతో కేంద్రంలో అధికారంలోకి వస్తారని ఎలా చెబుతారని.. ఇదంతా కేవలం రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడమేనని రామకృష్ణ మండిపడ్డారు.
ఇదీ చదవండి: 'భాజపాకు మెజార్టీ ఉంది.. ప్రత్యేక హోదా అడగలేకపోతున్నాం'