MLC Uday bhaskar driver's death case: వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ డ్రైవర్ మృతిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎంపీ హర్షకుమార్లు ఎమ్మెల్సీ తీరును తప్పుపట్టారు. పోలీసులు దోషుల్ని కాపాడుతున్నారని ఆరోపించారు.
ప్రమాదంలో మరణిస్తే..ఎమ్మెల్సీ మృతదేహాన్ని ఎలా తరలిస్తారు?: వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ను తక్షణమే అరెస్టు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం ప్రమాదంలో చనిపోయాడని చెప్పి.. మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. నిజంగా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణిస్తే ఎమ్మెల్సీ మృతదేహాన్ని ఎలా తరలిస్తారని నిలదీశారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపారు: వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. అందుకే మార్చురీలోకి ఎవరినీ అనుమతించడం లేదని అన్నారు. హర్షకుమార్ జీజీహెచ్ వద్దకు సుబ్రహ్మణ్యం మృతదేహం పరిశీలించేందుకు రాగా.. పోలీసులు గేట్లకు తాళాలు వేసి అనుమతించలేదు. ఈ వ్యవహారంలో పోలీసులు దోషుల్ని కాపాడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీని తక్షణం అరెస్ట్ చేయాలని జనసేన నాయకుడు పంతం నానాజీ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి :