సంస్కృతి, సంప్రదాయం అని పంచభూతాలను భాజపా అమ్మేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఇస్రో సంస్థను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రైవేటీకరణను ఇస్రో ఛైర్మన్ మాధవన్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఇప్పటికే డిఫెన్స్, బొగ్గు గనులు ప్రైవేట్ పరం అయ్యాయని విమర్శించారు.
భాజపా ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేస్తోందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. కార్పొరేట్ దిగ్గజాలకు సహజ వనరులను కట్టబెడుతుందని ఆరోపించారు. తెలంగాణలో కరోనా భయంతో ప్రజలుంటే.. హరితహారం మోజులో నాయకులు ఉన్నారని అగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం పేరుతో కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలో ఏకంగా 20 రోజులపాటు పెట్రోల్, డిజీల్ ధరలు పెంచలేదని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
ఇదీ చూడండి: మా ఇంట్లోకి నేను వెళ్లాను..! సమస్యలుంటే న్యాయపరంగా తేల్చుకోవాలి: దాసరి అరుణ్