విజయవాడలోని దాసరి భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృతజ్ఞత సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సహా వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ లో మెుత్తం 32 లక్షల మంది బాధితులు ఉన్నారని, ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని నారాయణ తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులు చేసిన పోరాటం దేశంలోనే ఆదర్శనీయమైనదన్నారు.
''అగ్రిగోల్డ్ బాధితులు సుమారు 32 లక్షల మంది. వారు సెబీ చట్టానికి విరుద్ధంగా సమీకరించని నిధులవడంతో ఇరుక్కుపోయింది. దీనిని బయటపెట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. అసోసియేషన్ ఐక్యంగా పనిచేయడంతో అంతిమంగా విజయం సాధించారు. ముఖ్యమంత్రి జగన్ కూడా చొరవ చూపించడంతో బాధితుల్లో విశ్వాసాన్ని కలించారు. సంస్థకి అప్పులకన్నా ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. కస్టమర్లు అధైర్య పడనవసరం లేదు.''- నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
పేరు మార్చి.. మళ్లీ..
ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. త్రిశక్తి, త్రిభూత అనే పేర్లతో.. అగ్రిగోల్డ్ యజమానులు మరో కొత్త దోపిడీకి తెరలేపుతున్నారని వారు ఆరోపించారు. వాటిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరావు విజ్ఞప్తి చేశారు. రూ. 20 వేలలోపు ఉన్న 10.4 లక్షల మంది బాధితులకు రూ. 906 కోట్లను ప్రభుత్వం విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఇదీ చదవండి:
Protest: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో తాత్కాలిక ఉద్యోగుల సమ్మె