అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేయడమంటే రాజ్యాంగ ఉల్లంఘనే అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ప్రధాని ఇలాంటి చర్యలకు పోతే అరాచకాలు మొదలవుతాయని తెలిపారు.
మొన్నటి వరకు జరిగిన బాబ్రీ మసీదు గొడవలకు పరిష్కారం కనుగొన్నాం. మోదీ వెళ్తే అలా జరిగితే మళ్లీ నిరసనలు కొనసాగే ప్రమాదం ఉందన్నారు. ప్రధాని శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లడానికి వీల్లేదని నారాయణ డిమాండ్ చేశారు. ఒకవేళ శంకుస్థాపనకు వెళితే రాజ్యాంగ వ్యతిరేక ప్రధానిగా మిగిలి పోతారని హెచ్చరించారు.
ఇదీ చూడండి : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. వాళ్లకే ఛాన్స్