భాజపా ప్రజా ఆగ్రహ సభ పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఏం చేశారో చెప్పుకోలేక రూ.50లకే చీప్ లిక్కర్ ఇస్తామని చెప్పి, ఓట్లు అడగడం ఏమిటని ప్రశ్నించారు. విజయవాడలో జరిగిన సమావేశంలో మాట్లాడిన రామకృష్ణ.. సైద్ధాంతిక పరమైన విమర్శలు చేస్తే స్వాగతిస్తామని, కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే వ్యతిరేకిస్తామని మండి పడ్డారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. విభజన హామీలు అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమో.. లేక రాష్ట్ర ప్రభుత్వమో చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు అంశంలో భాజపా నాయకులు కమీషన్లు తీసుకున్నారని, తనపై ఆరోపణలను నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధమని సవాల్ చేశారు.
ఇదీచదవండి.