సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా టార్గెట్ పాలిటిక్స్ చేస్తున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ దాసరి భవన్లో అన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో కరోనా వ్యాప్తి చెందుతుందని సభను రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి.. బస్సుల్లో వేలాదిమందిని దొంగ ఓట్ల కోసం తరలిస్తే కరోనా రాదా అంటూ ప్రశ్నించారు.
అక్రమ కేసులతో బెదిరింపులు..
టార్గెట్లు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికలను నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా నాయకులను పక్కన బెట్టి పూర్తిగా పోలీసులు, వాలంటీర్లతో.. ఓటర్లను, ప్రతిపక్షాలను బెదిరిస్తూ ఎన్నికలను ప్రహసనంగా మార్చారని మండిపడ్డారు. జడ్జి రామకృష్ణపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా మూడు నెలలకో కేసు పెడుతున్నారన్నారు. ఇప్పుడు తాజాగా ఆయనపై పెట్టిన దేశద్రోహం కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కట్టడి చర్యల సూచనలకై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: