ETV Bharat / city

'ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోతలా జగన్ పాలన: నారాయణ - సీపీఐ రామకృష్ణ అరెస్టు

CPI Narayana News: రాజ్​భవన్ బయల్దేరిన సీపీఐ నేతల అరెస్టును పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. రాజధాని లేని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని నారాయణ ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను నారాయణ పరామర్శించారు.

CPI Narayana Comments on CM Jagan
CPI Narayana Comments on CM Jagan
author img

By

Published : Jun 2, 2022, 6:16 PM IST

CPI Narayana Comments on CM Jagan: 'ముఖ్యమంత్రి జగన్ పాలన ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోతలా' ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలనే డిమాండ్​తో రాజ్​భవన్​ బయల్దేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేసి తాడేపల్లికి తరలించారు. ఈక్రమంలో రామకృష్ణను పరామర్శించేందుకు నారాయణ తాడేపల్లికి వెళ్లారు. తమ పార్టీ నేతల అక్రమ అరెస్టులను నారాయణ ఖండించారు.

మూడు రాజధానుల ప్రకటన వచ్చిన వెంటనే రాష్ట్రంలో భూముల ధరలు తగ్గి పక్క రాష్ట్రంలో పెరిగాయని.. అందుకే జగన్ మా పెద్ద అన్నయ్య అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారని నారాయణ పేర్కొన్నారు. రాజధాని లేని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళలు, దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టే వరకు సీపీఐ పోరాటం చేస్తోందని రామకృష్ణ చెప్పారు. జగన్​ పాలనలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేకుండా పోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.