కొవిడ్ వ్యాక్సిన్ గురించి భయపడాల్సిన అవసరం లేదని.. తాను కూడా టీకా తీసుకున్నానని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. రెండో విడత కొవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్తోపాటు ఆయన కుమార్తె హిబా ఫర్హీన్ సైతం టీకా తీసుకున్నారు. విజయవాడ గిరిపురం ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కొవిడ్ టీకాలను తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:
'బొత్సకి చెప్పినా చర్యలు లేవు.. అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తా'