ETV Bharat / city

రెండో రోజు 13,041 మందికి కొవిడ్ వ్యాక్సినేషన్

author img

By

Published : Jan 17, 2021, 10:51 PM IST

మొదటి దశ టీకా పంపిణీ కార్యక్రమం.. రాష్ట్రంలో రెండవ రోజూ జరిగింది. మొత్తం 332 కేంద్రాల్లో 13,041 మందికి వైద్యులు వ్యాక్సిన్ ఇచ్చారు. కృష్ణా, నెల్లూరుల్లో ఒక్కొక్కరు చొప్పున అస్వస్థతకు గురి కాగా.. చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు. వివిధ కారణాల వల్ల ముందుగా నిర్దేశించిన వారిలో అధిక శాతం టీకా తీసుకోలేదన్నారు.

vaccination second day in ap
ఏపీలో రెండో రోజు వ్యాక్సినేషన్

రాష్ట్రంలోని 332 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండవ రోజూ కొనసాగింది. 27,233 మందికి టీకాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయగా.. 13,041 మంది మాత్రమే తీసుకున్నారని వైద్యాధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,959 మంది, అత్యల్పంగా కృష్ణాలో 485 మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రకాశంలో 1,409, నెల్లూరులో 1,320, చిత్తూరులో 1,228 మంది, శ్రీకాకుళంలో 1,140, కర్నూలులో 1,025, కడపలో 900, విశాఖలో 855, గుంటూరులో 798, అనంతపురంలో 746, పశ్చిమగోదావరిలో 592, విజయనగరంలో 584 మంది చొప్పున వ్యాక్సిన్ తీసుకున్నట్లు వెల్లడించారు. వ్యాక్సినేషన్ తర్వాత కృష్ణాలో ఒకరు, నెల్లూరులో మరొకరు స్వల్ప అస్వస్థతకు గురికాగా.. వారికి ఏఈఎఫ్ఐ కేంద్రంలో చికిత్స అందించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

కొంతమంది వైద్య సిబ్బంది చరవాణులకు సమాచారం రాకపోవడం.. టీకాలు తీసుకోకపోవడానికి ఒక కారణమని తెలుస్తోంది. మరికొంతమంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. టీకా వేయించుకోవాల్సిన వారికి వ్యాక్సినేషన్ కేంద్రం నుంచి ఫోన్ చేసి సమాచారమందించగా.. కొంతమంది వివిధ కారణాలతో ఇప్పుడు రాలేకపోతున్నామని చెపుతున్నట్లు సిబ్బంది తెలిపారు. నిర్దేశించిన వారికి మాత్రమే ప్రస్తుతం వ్యాక్సిన్ ఇస్తుండటంతో.. టీకా తీసుకునేందుకు కొందరికి ఆసక్తి ఉన్నా పేరు లేక ఆగిపోతున్నారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ అనంతరం తమకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదని.. ప్రభుత్వం మొదటి దశలో తమకు టీకా పంపిణీ చేయడం సంతోషంగా ఉందని టీకా తీసుకున్న సిబ్బంది చెబుతున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 161 కరోనా కేసులు.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.