ETV Bharat / city

రోజులు బాగాలేవు జాగ్రత్త.. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? - ఏపీ కరోనా వార్తలు

రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజూ కొవిడ్ పాజిటివ్​గా వచ్చే వారి సంఖ్య 20 వేలకు తగ్గడం లేదు. మరణాలు సైతం.. భయం పుట్టిస్తున్నాయి. పల్లె నుంచి పట్టణం వరకూ వైరస్​ చుట్టుముట్టేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మరీ 104 పేరిట కాల్ సెంటర్లు ఏమైనట్టు? మూడు గంటల్లో బాధితుడికి పడక అందుబాటులో ఉండేలా చూడాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలు ఏమయ్యాయి? వైద్యం కోసం ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాస్తున్న బాధితుల పరిస్థితేంటి?

covid pandemic in andhra pradesh
covid pandemic in andhra pradesh
author img

By

Published : May 10, 2021, 5:32 PM IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజువారీ పరీక్షల్లో.. 20 శాతం మందికిపైగా వైరస్‌ బారినపడుతున్నారు. మరణాలూ రోజూ 90కి తగ్గడం లేదు. పల్లెల నుంచి పట్టణాల దాకా వైరస్‌ కమ్మేసింది. రోగులకు ఆసుపత్రుల వద్ద పడిగాపులు తప్పడం లేదు. రోగి ఆక్సిజన్‌ స్థాయి తగ్గితే లక్షలు ఇస్తామంటున్నా.. ప్రైవేటు ఆసుపత్రులు బాధితుల్ని.. చేర్చుకోవడం లేదు. సొంతంగా ఆక్సిజన్‌ సమకూర్చుకుంటే పడకలు సర్దుబాటు చేస్తామంటున్నాయి.. ప్రైవేటు ఆసుపత్రులు.

వాహనాల్లోనే ఆక్సిజన్ సిలిండర్లు

రాష్ట్రంలో కరోనా హైరానా పెరిగిపోతోంది. గతేడాది కరోనా వచ్చినప్పుడు.. ఇంట్లో ఉంటూనే అనేక మంది వైరస్‌ను... జయించారు. ఇప్పుడు రోజులు బాగోలేవు. హోం ఐసొలేషన్‌ అవుతున్న చాలామంది బాధితుల్లో ఒక్కసారిగా శరీరంలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గిపోతున్నాయి. అప్పటికప్పుడు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఆస్పత్రుల్లో పడకలు దొరికితే అదృష్టం.. లేదంటే.. దేవుడిపై భారం వేయడమే అన్నట్లుంది. బెడ్‌ ఖాళీ అయ్యే దాకా.. వాహనాల్లోనే ఆక్సిజన్‌ సిలిండర్లు అమర్చుకుని నిరీక్షిస్తున్నవారు కోకొల్లలు. అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు పూర్తిగా నిండిపోయాయి. కొందరికి ఆరుబయటే చికిత్స అందిస్తున్నారు. అనంతపురం జిల్లాలోనైతే ఎక్స్‌రే యంత్రం కూడా బయటికి తెచ్చి పరీక్షలు చేస్తున్నారు.

పడకల కోసం ఆరుబయటే..

కొవిడ్‌ రోగి 108 కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసిన మూడు గంటల్లోగా పడకలు ఇవ్వాలని సీఎం జగన్‌ ప్రతి సమీక్షలోనూ చెప్తున్నారు. ఆచరణలో అదేమీ కనిపించడం లేదు. ఫోన్‌ చేస్తే బెడ్‌ కాదుకదా.. కనీసం ఆస్పత్రి ఆవరణలో ఇంత ఖాళీ జాగా దొరికినా గొప్పే అన్నట్లుంది. 30 గంటలకుపైగా వాహనాల్లోనే వేచిచూసి.. ఆస్పత్రి ఆవరణలోనే విగతజీవులవుతున్న విషాద ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులైతే.. కేసు తీవ్రత ఎక్కువ ఉంటే మొహం మీదే గేట్లు మూసేస్తున్నాయి. ఖర్చు ఎంతైనా భరిస్తామంటున్నా అంబులెన్సులను ఆస్పత్రి ఆవరణలోకి కూడా అడుగుపెట్టనివ్వడంలేదు. దీనికి ఆక్సిజన్‌ కొరతను కారణంగా ఆయా ఆస్పత్రులు చెప్పుకొస్తున్నాయి. రోజూ వందల మంది ఆసుపత్రుల్లో చేరుతుంటే పది నుంచి 20 మంది కూడా డిశ్చార్జి కావడం లేదు. కొవిడ్‌ వైద్యం అందించే ఏ ఆస్పత్రికి వెళ్లినా పడకల కోసం ఆరుబయట నిరీక్షిస్తూనే ఉంటున్నారు.

వాట్సాప్ ద్వారా మందులు

కొవిడ్‌ తొలి విడత కంటే రెండో విడతలో పరిస్థితులు దయనీయంగా ఉంటున్నాయి. కరోనా పరీక్షా ఫలితాల్లో జాప్యం.. మరో సమస్యకు దారితీస్తోంది. పాజిటివ్‌ వస్తే హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగని 104 కాల్‌ సెంటర్‌కుగానీ, ఏఎన్‌ఎంకు గానీ ఫోన్‌ చేస్తే హోం ఐసొలేషన్‌ కిట్లు ఇవ్వడం లేదు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. చాలామంది ప్రైవేటు వైద్యులను సంప్రదించి వాట్సాప్‌ ద్వారా మందులు తె‌ప్పించుకుని వాడుతున్నారు. అలా హోం ఐసొలేషన్‌లో చివరి క్షణం వరకూ ప్రమాదాన్ని అంచనా వేయలేకపోతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తగానే ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇలాంటి కేసులు పెరగడం ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్ల కొరతకు కారణమవుతోంది.

మందుల ధరలు పెరిగాయి

ఆరోగ్య పరిస్థితి విషమించిన కరోనా బాధితులకు అందజేసే.. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత ఈ నెల మొదటి వారం వరకూ ఎక్కువే ఉంది. నకిలీ ఇంజక్షన్ల దందా కూడా నడిచింది. కరోనా బాధితులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్లను.. ఆస్పత్రి సిబ్బందే బయటికి తెచ్చి 50 వేల నుంచి 80 వేల రూపాయలకు విక్రయించిన ఉదంతాలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు అవసరమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ ద్వారానే సరఫరా చేస్తుండడంతో సమస్య తీవ్రత కొంత తగ్గింది. కరోనా కేసులకు తోడు మే మొదటి వారంలో.. సాధారణ మందుల ధరలూ పెరిగాయి. ఆక్సిజన్‌ స్థాయిలు గుర్తించే పల్స్‌ ఆక్సీమీటర్లు, జ్వరం తీవ్రత గుర్తించే థర్మామీటరు తగినంత స్టాక్‌ లేక ధరలు పెంచేశారు.

లక్షలు ఖర్చు చేస్తున్నా..

రాష్ట్రంలో 660 ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సలు చేస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో 3 వేలకు మించి వెంటిలేటర్లు లేవు. ఆక్సిజన్‌ స్థాయి 80 కంటే తగ్గితే.. వారిని వెంటిలేటరుపై ఉంచుతున్నారు. ఒకసారి కరోనా బాధితుడిని వెంటిలేటరుపై ఉంచితే రోజుల తరబడి ఉంటున్నా కోలుకోవడం లేదు. లక్షలు ఖర్చు చేస్తున్నా కోలుకుంటున్నవారు తక్కువగా ఉంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వెంటిలేటర్‌ పడకలు దొరకడం లేదు. రోజురోజుకూ ఆక్సిజన్‌ అవసరమయ్యే కేసులు పెరుగుతున్నాయి. వేల మందికి ప్రాణవాయువు సమకూర్చడం కష్టంగా మారింది. మార్కెట్లో ఒక్కో ఆక్సిజన్‌ సిలిండర్ 25 వేల చొప్పున విక్రయిస్తున్నారు. అవీ.. సరిగా దొరకడం లేదు. ఈ నెల 15 నాటికి వెయ్యి టన్నుల వరకూ ఆక్సిజన్‌ అవసరమని.. అధికారులు అంచనా వేస్తుంటే ప్రస్తుతం 550 మెట్రిక్‌ టన్నుల వరకే సమకూర్చుకోగలుగుతున్నారు.

శ్మశానాలకు తరలించాలంటే.. వేల రూపాయలు

కరోనా బాధితుల్ని తరలించేందుకు.. అంబులెన్స్‌ల కొరత అంతా ఇంతా కాదు. రోగి అత్యవసర పరిస్థితుల్ని ఆసరగా చేసుకుని వీటి ధరలుంటున్నాయి. పల్లెల నుంచి పట్టణాలు, నగరాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఓ ధర ఉంటే.. ప్రైవేటు ఆసుపత్రులకు మరో ధర ఉంటోంది. ఇక ఆక్సిజన్‌ సౌకర్యంతో రాష్ట్ర సరిహద్దులు దాటాల్సి వస్తే.. నోటికి ఎంత వస్తే అంత ధర అడుగుతున్నారు. బాధితులు సైతం బేరాలాడే సమయం కాదనుకుని.. అడిగినంత ఇస్తున్నారు. ఒకవేళ పరిస్థితి విషమించి రోగులు చనిపోతే.. ఇక కర్మకాలినట్లే. కరోనా మృతదేహాల్ని శ్మశానాలకు తరలించేందుకు వేల రూపాయలు అడుగుతున్నారు.

వాహనాలు చాలడం లేదు..

ప్రైవేటు అంబులెన్స్‌లు కిలోమీటర్ల ఆధారంగా ఛార్జి వసూలు చేయాలని ప్రభుత్వం చెప్పినా.. అది అమలయ్యే పరిస్థితి లేదు. అడిగినంత ఇవ్వకపోతే.. మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్తామని ఖరాఖండిగా చెబుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చనిపోతే మృతదేహాలను ఆరోగ్యశాఖ మహాప్రస్థానం వాహనాల ద్వారా ఉచితంగా వారి స్వస్థలాలకో, శ్మశానాలకో తరలిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటివి సుమారు 80 వాహనాలే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి ప్రభుత్వాస్పత్రికి ఐదు నుంచి ఏడు వాహనాలే కేటాయించారు. కరోనా మృతుల సంఖ్య పెరగడంతో.. ఆ వాహనాలు చాలడం లేదు.

జాగ్రత్తగా లేకుంటే.. తప్పదు నష్టం

ఇంతటి తీవ్రమైన ముప్పును తప్పించుకోవాలంటే.. ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇంటికే పరిమితం కావడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. అవకాశం ఉంటే వ్యాక్సిన్ తీసుకోవడం.. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకపోవడం.. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా తక్షణమే వైద్యులను సంప్రదించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని.. ప్రజలంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇదీ చదవండి:

'కేసీఆర్ అన్నా.. మేం హైదరాబాద్​ ఆస్పత్రికి రాకూడదా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.