ETV Bharat / city

ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రం: మంత్రి పెద్దిరెడ్డి

కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ఐసోలేషన్​ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ కొవిడ్​ కేర్​ సెంటర్ల బాధ్యత సర్పంచులకు అప్పగిస్తామని తెలిపారు.

minister peddireddy
మంత్రి పెద్దిరెడ్డి
author img

By

Published : May 24, 2021, 3:52 PM IST

రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలలు, వసతి గృహాలు, ఇతర భవనాల్లో కొవిడ్​ కేర్​ సెంటర్లు పెట్టేందుకు యోచిస్తున్నామన్నారు. కేంద్రాల గుర్తింపు పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తామని చెప్పారు.

కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణ బాధ్యత సర్పంచులే చూసుకోవాలని స్పష్టం చేశారు. కరోనా కేసుల ఆధారంగా బెడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వైరస్​ బాధితులకు ఇబ్బంది కలగకుండా స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ఐసోలేషన్ కేంద్రాలుంటాయని వెల్లడించారు.

ఇదీ చదవండి: ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.