ETV Bharat / city

విద్యార్థిని హత్య కేసు: పోలీసు కస్టడీకి నిందితుడు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన విజయవాడ ఇంజినీరింగ్ యువతి హత్య కేసులో నిందితుడిని పోలీసు కస్టడీకి ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. మూడు రోజుల పాటు అతడిని దిశా పోలీసులు విచారించనున్నారు. ఘటన జరిగిన రోజున ఆ గదిలో వారిద్దరి మధ్య ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ప్రధానంగా ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది.

divya tejaswini murder case
divya tejaswini murder case
author img

By

Published : Nov 16, 2020, 10:49 PM IST

విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబును మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు దిశ పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ప్రస్తుతం నాగేంద్రబాబు అరెస్టై పోలీసుల రిమాండ్​లో ఉన్న విషయం తెలిసిందే. అతనికి విధించిన 14 రోజుల రిమాండ్ ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. విచారణ ఆ రోజు నాటికి పూర్తి చేసి సాయంత్రం 5 గంటలలోపు కోర్టులో తిరిగి హాజరుపరచనున్నట్లు సమాచారం. అలాగే విచారణలో సేకరించిన సమాచారాన్ని కూడా కోర్టుకి సమర్పించే అవకాశం ఉంది.

గత నెల 15వ తేదీ విజయవాడలోని మాచవరంలో జరిగిన ఈ హత్య కేసులో ఇప్పటికే పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. ఫోరెన్సిక్, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దివ్య తేజస్వినిది హత్యేనని నిర్థరణకు వచ్చారు. అయితే.. నిందితుడు మాత్రం తామిద్దం కలిసి చనిపోదామనుకున్నామని, ఎవరికి వారే గాయాలు చేసుకున్నామని చెబుతున్నాడు. అతను చెప్పే దానికి క్షేత్రస్థాయిలో లభించిన ఆధారాలకు పొంతన లేదు. అదేవిధంగా హత్య జరిగిన రోజు ఆ గదిలో వారిద్దరి మధ్య ఏం జరిగిందనే విషయంపై పోలీసులకు స్పష్టత లేదు.

ఈ నేపథ్యంలో నాగేంద్రబాబుని కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే ఈ కేసు కొలిక్కి వస్తుందని పోలీసులు భావించారు. వారం రోజులు పోలీసు కస్టడీకి కోరుతూ ఈనెల 9వ తేదీన దిశ పోలీసుల తరపున ప్రత్యేక ప్రాసిక్యూటర్ విజయ్ కుమార్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే నిందితుడు నాగేంద్రబాబు తనకు న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేదని కోర్టుకు తెలపటంతో .. అతనికి మండల న్యాయ సేవాధికార సంస్థ ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించింది.

ఇదీ చదవండి:

తాగిన మైకంలో కానిస్టేబుల్ బూతు పురాణం... వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.