Couple Suspicious death: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్‌లో వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి కలకలం రేపింది. వాంబే కాలనీ లోని ఏ బ్లాక్లో నివాసం ఉంటున్న కొండయ్య(65),పైడమ్మ(60)లు కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. తెల్లవారినా తలుపులు తెరవకపోవటంతో.. అనుమానం వచ్చిన చుట్టుపక్కలవారు కిటికీలోంచి తొంగిచూడగా ఇద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. దీంతో.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. దంపతుల మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులకు సర్జికల్ స్పిరిట్, తక్కువ ధర రకం మద్యం సేవించే అలవాటు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. దానివల్ల ఏమైనా చనిపోయి ఉంటారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: