VACCINE BOOSTER DOSE IN AP: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఇందుకోసం నేటి నుంచి 13 వరకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. వీరితో పాటు.. రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వారికి సైతం బూస్టర్ డోసులు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే రెండు డోసులు తీసుకోవడం పూర్తై.. 9 నెలలు గడిచిన వారికి టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలో ఏ రకమైన టీకా తీసుకున్నారో.. అదే టీకా మళ్లీ ఇవ్వనున్నట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతుందని వెళ్లడించారు.
ఇదీ చదవండి:
Attack: ప్రేమను తిరస్కరించిందని ఆగ్రహం.. బాలిక గొంతు కోసిన యువకుడు