కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలన్న ప్రణాళికలను విద్యార్థులు తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏదో ఒక ఉద్యోగం, కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నారు. విదేశీ విద్య విచారణల కోసం వస్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. దీంతో విదేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులతో కళకళలాడాల్సిన కన్సల్టెన్సీలు ప్రస్తుతం బోసిపోతున్నాయి. అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో ఆగస్టు, సెప్టెంబరులో జరిగే(ఫాల్) ప్రవేశాలు ఈసారి ఆన్‌లైన్‌కే పరిమితమయ్యాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారిలో 30శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌పై మక్కువ చూపుతున్నట్లు కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి. ఆన్‌లైన్ తరగతులకు 42శాతం నుంచి 50 శాతం రుసుములు వసూలు చేస్తాయి.
విదేశీ విద్య తాత్కాలిక వాయిదా - online classes
కొవిడ్-19 నిర్మూలనకు అన్ని దేశాల్లో లాక్డౌన్ విధించారు. ఫలితంగా అన్ని రంగాల సంస్థలు మూతపడ్డాయి. అయితే కరోనా దెబ్బ విద్యార్థులపై ఎక్కువగా పడింది. విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలన్న ప్రణాళికలను విద్యార్థులు తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. ఆన్‌లైన్ తరగతులు వినేవారి సంఖ్య తక్కువగానే ఉంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలన్న ప్రణాళికలను విద్యార్థులు తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏదో ఒక ఉద్యోగం, కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నారు. విదేశీ విద్య విచారణల కోసం వస్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. దీంతో విదేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులతో కళకళలాడాల్సిన కన్సల్టెన్సీలు ప్రస్తుతం బోసిపోతున్నాయి. అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో ఆగస్టు, సెప్టెంబరులో జరిగే(ఫాల్) ప్రవేశాలు ఈసారి ఆన్‌లైన్‌కే పరిమితమయ్యాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారిలో 30శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌పై మక్కువ చూపుతున్నట్లు కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి. ఆన్‌లైన్ తరగతులకు 42శాతం నుంచి 50 శాతం రుసుములు వసూలు చేస్తాయి.
ఇదీ చూడండి: మిడతల దండుకు... కంచే కాపు..!