విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, లూనా సెంటర్ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ కారణంగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయాన్నే రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలకు.. కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.
ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరే ఉండి జాగ్రత్తలు వహించాలని కోరుతున్నారు. రెడ్ జోన్ ప్రాంతంలో ఎవరికైనా నిత్యావసర వస్తువులు కావల్సి వస్తే.. స్థానిక వాలంటీర్లకు సమాచారం అందించాలని సూచించారు. కొంతకాలం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మైకుల ద్వారా స్థానికులకు ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.
ఇవీ చదవండి: