ap corona cases today: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 40,266 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 14,502 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మరణించగా.. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. కరోనా బారి నుంచి తాజాగా 4,800 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 93,305 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,728 కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ ఇప్పటివరకూ 14,549 మంది మృతి చెందారు.
దేశంలో ఒక్కరోజే 3 లక్షల కరోనా కేసులు.. 439 మరణాలు
Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. 24 గంటల వ్యవధిలో.. 3,06,064 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 439 మంది మరణించారు. 2,43,495 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 20.75 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 93.07గా నమోదైందని పేర్కొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 241 రోజుల గరిష్ఠానికి చేరుకుందని వెల్లడించింది.
- మొత్తం కేసులు: 3,95,43,328
- మొత్తం మరణాలు: 4,89,848
- యాక్టివ్ కేసులు: 22,49,335
- మొత్తం కోలుకున్నవారు: 3,68,04,145
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 27,56,364 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,62,26,07,516కు చేరింది.
ఇదీ చదవండి: