AP CORONA CASES: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 22,785 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 749 కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి 6,271 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 18,929 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
దేశంలో 50వేల దిగువకు రోజువారీ కరోనా కేసులు..
Corona cases in India: భారత్‌లో కరోనా కేసులు వరుసగా రెండోరోజు తగ్గాయి. కొత్తగా 44,877 మందికి వైరస్ సోకింది. కొవిడ్ ధాటికి మరో 684 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,17,591 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు ప్రస్తుతం 1.43 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,26,31,421
- మొత్తం మరణాలు: 5,08,665
- యాక్టివ్ కేసులు: 5,37,045
- మొత్తం కోలుకున్నవారు: 4,15,85,711
దేశంలో కొత్తగా 49,16,801 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,72,81,49,447 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
World Corona Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 18 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 7,731 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 41 కోట్లు దాటగా.. మరణాల సంఖ్య 58,27,861 కు చేరింది.
- రష్యాలో మరో 2.03 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. మరో 229 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో ఒక్కరోజే 1.51 లక్షల మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 122 మంది మృతిచెందారు.
- బ్రెజిల్లో కొత్తగా 1.34 లక్షల మందికి కరోనా సోకింది. 892మంది మరణించారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 1.18 లక్షల కేసులు బయటపడగా.. 161 మంది బలయ్యారు.
- జపాన్‌లో ఒక్కరోజే 98 వేలకు పైగా మందికి వైరస్ సోకింది. మరో 142 మంది మృతిచెందారు.
ఇదీ చదవండి:
CPI Narayana on Union Government: కేసీఆర్‌లా జగన్ కూడా పోరాడాలి -సీపీఐ నారాయణ