AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 4,198 కరోనా కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 30,886 మందికి కరోనా పరీక్షలు చేపట్టారు. కొవిడ్ నుంచి కొత్తగా 9,317 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 88,364 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
జిల్లాలవారీగా కేసులు
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 555 కేసులు నమోదు కాగా.. కృష్ణా జిల్లాలో 528, గుంటూరు జిల్లాలో 485, కర్నూలు జిల్లాలో 459 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో తగ్గిన కరోనా కొత్త కేసులు.. 5లక్షలు దాటిన మరణాలు
Covid cases in India: భారత్‌లో కొవిడ్ కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 1,49,394 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1,072 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,46,674 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 9.27 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల సంఖ్య 5 లక్షలు దాటింది.
యాక్టివ్ కేసులు ప్రస్తుతం 4.20 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 94.60 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం మరణాలు: 5,00,055
- యాక్టివ్ కేసులు: 14,35,569
- మొత్తం కోలుకున్నవారు: 4,00,17,088
World Corona cases: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 30,65,159 మందికి కరోనా సోకింది. 11,310 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 38,82,54,530 కు చేరగా.. మరణాల సంఖ్య 57,30,459 కు పెరిగింది.
- ఫ్రాన్స్‌లో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 2.74 లక్షలకు పైగా కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. మరో 264 మంది చనిపోయారు.
- US Corona Cases: అమెరికాలో కొత్తగా 2.55 లక్షల మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 2,376 మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 2,86,050 మందికి వైరస్ సోకగా.. 923 మంది చనిపోయారు.
- అర్జెంటీనాలో తాజాగా 43 వేలకుపైగా కరోనా కేసులు బయటపడగా.. 285 మంది బలయ్యారు.
- జర్మనీలో ఒక్కరోజే దాదాపు 2.40 లక్షల మందికి వైరస్ సోకింది. మరో 186 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి:
APSRTC Employees Strike: ఆర్టీసీలో సమ్మె సైరన్.. రేపు, ఎల్లుండి డిపోల్లో నిరసనలు