No plastic during elections: హరిత ప్రొటోకాల్‌లో భాగంగా ప్లాస్టిక్, నాన్ సస్టైనబుల్ వస్తువులు, పరికరాలను నియంత్రిస్తూ భవిష్యత్తులో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్ణీత కాలవ్యవధిలో నియంత్రించేలా చర్యలు చేపట్టామన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆదివారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ నెలాఖరు వరకూ నిర్వహిస్తామని వివరించారు
ఇవీ చూడండి: