ETV Bharat / city

'న్యాయమూర్తులపై అనుచిత పోస్టింగుల వెనుక కుట్ర' - సోషల్ మీడియా పోస్టింగ్​ల వెనుక కుట్ర

న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టింగుల వెనుక కుట్ర దాగుందంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ కర్నూలు జిల్లాకు చెందిన మాజీ పోలీసు అధికారి ఎం.శివానందరెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు అప్పగించి నిగ్గు తేల్చాలని కోరారు.

న్యాయమూర్తులపై అనుచిత పోస్టింగుల వెనుక కుట్ర

author img

By

Published : Oct 6, 2020, 4:38 AM IST

సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులపై విచారణ ప్రక్రియలో సహకారం అందించేందుకు అవకాశం కల్పించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ వ్యాజ్యంలో దర్యాప్తు సంస్థలు కోర్టు విచారణకు సరిగా సహకరించడం లేదని పేర్కొంటూ కర్నూలు జిల్లాకు చెందిన మాజీ పోలీసు అధికారి శివానంద రెడ్డి...ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్యాంగ విధులు నిర్వర్తించే హైకోర్టుకు ఆటంకాలు కల్పించడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. రాజకీయ పార్టీల సామాజిక మాధ్యమ విభాగాలు చట్ట విరుద్ధ చర్యలతో హైకోర్టు ప్రతిష్ఠను దిగజారుస్తున్నాయన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేసినా.. దర్యాప్తు సంస్థలు లెక్కలేకుండా వ్యవహరిస్తున్నాయన్నారు. రాజకీయ అధిపతులు చెప్పినట్లుగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయన్నారు. అధికార పార్టీ హైకోర్టుకు విరుద్ధంగా ఎలాంటి కుట్రలు పన్నుతుందో సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ' ఐ - ప్యాక్ ' బృందానికి కోట్ల రూపాయలు చెల్లించి వైకాపా నియమించుకుందని పిటిషన్‌లో తెలిపారు. ఆ బృందంలోని ఐటీ నిపుణులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ వ్యతిరేకులపై ప్రజల్లో ద్వేషం కలిగించడంలో సిద్ధ హస్తులని పేర్కొన్నారు.

స్లీపర్ సెల్‌ల తరహాలో వ్యవహరిస్తున్నారు

రాష్ట్రంలోని ప్రతి పౌరుడి వ్యక్తిగత సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించి...కులం, మతం, రాజకీయ అభిరుచులు, తటస్థుల వారీగా వర్గీకరించారన్నారు. ఈ విధంగా ఓటర్లను తమవైపు తిప్పుకోవడం సహా...అనుకూలంగా లేని వారిని లక్ష్యంగా చేసుకున్నారని వ్యాజ్యంలో పేర్కొన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా ప్రభుత్వ ఆలోచనల్నే ప్రజల్లోకి వ్యాపింపజేస్తూ స్లీపర్ సెల్‌ల తరహాలో వ్యవహరిస్తున్నారన్నారు. తద్వారా ఆదాయం పొందుతున్నారన్నారు. హైకోర్టు న్యాయమూర్తులను అపకీర్తి పాలుచేయడం వైకాపా వ్యూహంలో భాగమేనన్నారు. న్యాయమూర్తులను న్యాయ పాలనకు దూరం చేయాలనేది వారి ఆలోచనగా పేర్కొన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు, కార్య నిర్వహణ యంత్రాంగం తమను తాము చట్టం కంటే ఎక్కువగా భావిస్తున్నారన్నారు. తమ నిర్ణయాల్ని ఎవరూ ప్రశ్నించకూడదన్నట్లు వారి వ్యవహార శైలి ఉందని శివానంద రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు, ఎన్నికల కమిషనర్ పదవీ కాలం కుదింపు, తప్పని సరి ఆంగ్ల మాధ్యమం అంశాల్లో ప్రభుత్వ విధానాలను హైకోర్టు రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పోలీసు శాఖ సైతం ప్రజలందరినీ ఒకే రీతిగా చూడకుండా ... రాజకీయ ప్రత్యర్థుల్ని భయభ్రాంతులకు గురిచేసేలా తప్పుడు కేసులు నమోదు చేస్తోందన్నారు. ఆయా చర్యలు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టే స్పష్టం చేసిందన్నారు. కోర్టు నిర్ణయాలను సహించలేకే సామాజిక మాధ్యమ విభాగాల ద్వారా హైకోర్టుపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక స్పష్టమైన కుట్ర దాగుందన్న శివానంద రెడ్డి... దర్యాప్తును సీబీఐకి అప్పగించడం ద్వారా చేధించాలని కోరారు

నిందితులను రక్షించే ప్రయత్నం

న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల అంశంలో హైకోర్టు 98 మందిని గుర్తించి, కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇవ్వగా... సీఐడీ మాత్రం 18 మందినే గుర్తించి బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిందన్నారు. ఎవర్నీ అరెస్ట్ చేయలేదని గుర్తు చేశారు. దీని ప్రకారం కార్య నిర్వాహక వ్యవస్థ, దర్యాప్తు సంస్థలు నిందితుల్ని రక్షించేందుకు యత్నిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. వైకాపా సోషల్ మీడియా ఇన్‌ఛార్జిగా పనిచేసిన దేవేందర్ రెడ్డి గుర్రంపాటిని సమాచార, పౌర సంబంధాల శాఖ చీఫ్ డిజిటల్ డైరెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందన్నారు. ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ టీమ్‌కు సహాయకుడిగా వ్యవహరించిన బ్రహ్మానంద ప్రాత, సీవీ రెడ్డిని సమాచార శాఖలో చీఫ్ డిజిటల్ డైరెక్టర్లుగా నియమించారన్నారు. సోషల్ మీడియా ప్రచారంలో వారు కీలక వ్యక్తులని పేర్కొన్నారు. వైకాపాకు చెందిన వారి సామాజిక మాధ్యమాల్లోని పోస్టింగులకు సంబంధించిన పలు ఆధారాలు, ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్లు, వ్యాఖ్యలు, పలువురు వైకాపా నేతల వ్యాఖ్యల వివరాల్ని పిటిషన్‌తో జత చేసినట్లు శివానంద రెడ్డి పేర్కొన్నారు.

ఇదీచదవండి

ఆ వ్యత్యాసాలు సవరించి రాష్ట్రాలకు ఎక్కువ నిధులివ్వాలి: బుగ్గన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.