ప్రతిపక్ష నాయకుడిగా కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న జగన్.. అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడం దారుణమని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహరావు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రేజర్వేషన్లు అమలు చేయకుండా కాపుల సంక్షేమంపై కాకి లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కోటి 10 లక్షల మంది కాపులున్నారని... ప్రభుత్వం వారి సంక్షేమంపై చెబుతున్న లెక్కలన్నీ అవాస్తవాలన్నారు.
అధికారంలోకి రావడానికి కాపుల మద్దతు తీసుకున్న జగన్...అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లు అమలు చేయకుండా ద్రోహం చేశారన్నారని ధ్వజమెత్తారు. కొందరి స్వార్థ రాజకీయాల వల్ల కాపులకు ఉన్న రిజర్వేషన్లు కోల్పోయామని.. కాంగ్రెస్ పార్టీ కాపు రిజర్వేషన్లు కల్పించడానికి చిత్తశుద్ధితో ఉందన్నారు.