ప్రధాని మోదీ ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే రైతులను రోడ్డుమీదకు వచ్చేలా చేశారన్నారు. లోక్సభ, రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు మద్దతు తెలిపిన వైకాపా, తెదేపాలు బిల్లులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. భాజపాతో కలిసిపోయిన జనసేన అధ్యక్షుడు పవన్ రైతులపక్షాన దీక్ష చేయటంపై ఆయన మండిపడ్డారు.
రైతు ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని రుద్రరాజు వెల్లడించారు. వ్యవసాయ బిల్లులపై ప్రజాభిప్రాయ సేకరణ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీచదవండి