అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ...ముఖ్యమంత్రి జగన్ను కలిసేందుకు బయల్దేరిన విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావును పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజధాని అమరావతికే కట్టుబడి ఉందన్న ఆయన...భవిష్యత్తులో ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధమని తేల్చిచెప్పారు. అక్రమ అరెస్టులకు తమ పార్టీ భయపడదని వెల్లడించారు.
అమరాతిని రాజధానిగా కొనసాగించే వరకు రాష్ట్ర ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి అపాయింట్మెంట్ ఇవ్వకపోగా...అక్రమ అరెస్టులతో జగన్ స్వభావం మరోమారు తేటతెల్లమైందన్నారు. ఇటువంటి చర్యలతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని ఆక్షేపించారు.
ఇదీచదవండి
కాంగ్రెస్ ర్యాలీ భగ్నం.. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అరెస్ట్