ETV Bharat / city

'అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తాం' - మూడు రాజధానులపై తాజా వార్తలు

అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు అన్నారు. ఈ నెల 5న అమరావతి అంశంపై చర్చించేందుకు పీసీసీ అధ్యక్షులు శైలజానాధ్ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలిపారు.

congress leader narahari setti on amaravathi issue
ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు
author img

By

Published : Dec 2, 2020, 4:19 PM IST

'ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని' కాంగ్రెస్ సిద్ధాంతమని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు అన్నారు. అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్తామని నరహరశెట్టి స్పష్టం చేశారు. ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష కోసం పీసీసీ అధ్యక్షులు శైలజానాధ్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు.

సీఎం జగన్​ ప్రత్యేక హోదాపై ఎన్నికలలో ఒకలా ప్రచారం చేసి, అధికారంలోకి వచ్చాక మరోలా ప్రచారం చేస్తున్నారని నరహరశెట్టి ఆరోపించారు. ప్రజలు ప్రత్యేక హోదాని మర్చిపోడానికి రాజధానిని విశాఖకు తరలిస్తున్నామని తెరపైకి తెచ్చారని విమర్శించారు. 'మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు' అన్న మాటకి కట్టుబడి ఉంటామన్నారు.

ఇదీ చదవండి: విశాఖలో యువతిపై కత్తితో యువకుడి దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.